HomeMovie NewsNTR 31 Movie Launch గ్రాండ్ గా ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ లాంచ్

NTR 31 Movie Launch గ్రాండ్ గా ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ లాంచ్

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర పార్ట్ 1 మూవీ షూటింగ్ వేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక దీనితో పాటు మరోవైపు హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీ షూట్ లో కూడా పాల్గొంటున్నారు.

అయితే వీటి అనంతరం తన తదుపరి మూవీని కూడా నేడు గ్రాండ్ గా లాంచ్ చేసారు ఎన్టీఆర్. కెజిఎఫ్, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న ఈ మూవీని ప్రముఖ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నారు. ఇటీవల అధికారికాక ప్రకటన వచ్చిన ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్ 31 గా రూపొందనుంది. విషయం ఏమిటంటే, నేడు హైదరాబాద్ లో ఈ మూవీ యొక్క అధికారిక పూజా కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరిగాయి.

See also  Mahesh Babu 'కల్కి 2898 ఏడి' పై మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మూవీ టీమ్ తో పాటు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కుటుంబసభ్యులు, నిర్మాత దిల్ రాజు సహా మరికొందరు సినీ ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేసారు. సెప్టెంబర్ నుండి ప్రారంభం కానున్న ఈ మూవీ వచ్చే ఏడాది చివర్లో ఆడియన్స్ ముందుకి రానున్నట్లు తెలుస్తోంది.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories